- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: నెల్లూరు జిల్లాకు మహర్దశ.. త్వరలో మారిపోనున్న రూపురేఖలు
దిశ, నెల్లూరు జిల్లా కావలి: రూ.300 కోట్లతో చేపట్టిన బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. హార్బర్‌లో జరుగుతున్న పనులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణ, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రికార్డు సమయంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను చేపట్టామన్నారు. ఇప్పటికే 95 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మౌలిక వసతులకు సంబంధించి మరో 5 శాతం పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఈ పనులను కూడా త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. ఈ హార్బర్ ఏర్పాటుతో సుమారు ఆరు వేల మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అన్ని విధాల ఈ ప్రాంత రూపు రేఖలు పూర్తిగా మారి పోతాయన్నారు.