Nellore: లారీ భీభత్సం... 18 గొర్రెలు దుర్మరణం

by srinivas |
Nellore: లారీ భీభత్సం... 18 గొర్రెలు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొత్తపేట వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకెళ్లి 18 మూగ జీవాలను బలితీసుకుంది. వరికోత మిషన్‌ను తరలించే క్రమంలో లారీ ఒక్కసారిగా కొత్తపేట వద్ద గొర్రెల మందపైకి దూసుకువెళ్లింది. దీంతో 18 గొర్రెలు అక్కడికక్కడే దుర్మరణం చెందాయి. మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. అయితే ప్రమాదం జరిగడంతో లారీని వదిలి డ్రైవర్ పరారయ్యాడు. గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4లక్షలు వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story