- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kavali: ఎమ్మార్వో విధులకు ఆటంకం.. 41 మందిపై కేసు
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలిలో గ్రావెల్ మాఫియాకు హద్దు అదుపు లేకుండా పోతోంది. అక్రమంగా గ్రావెల్ తవ్వుకుని యదేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఇందుకు అధికార పార్టీ నేతల అండదండలు సంపూర్ణంగా ఉండటంతో గ్రావెల్ మాఫియా రోజు రోజుకు మరింత రెచ్చిపోతోంది. దీంతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ మాఫియా అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడికి యత్నించారు. టీడీపీ నేత సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
అయితే టీడీపీ నేతలపై ఎమ్మార్మో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు టీడీపీ నేతలు ఆటంకం కలిగించారని కావలి టూ టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో టీడీపీ నేత సుబ్బానాయుడితో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. మొత్తం 41 మందిపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కావాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. తమ పార్టీ నాయలకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.