Nellore: వావిళ్లలో పేలుడు కలకలం

by srinivas |   ( Updated:2022-11-25 17:17:08.0  )
Nellore: వావిళ్లలో పేలుడు కలకలం
X

దిశ వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్లలో పేలుడు కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. అంతేకాదు ఒక్కసారిగా శబ్ధంతో కూడిన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్లు వాడేటప్పుడు అందుకు సంబంధించిన నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

READ MORE

Tirumalaలో కరీంనగర్ ఫారెస్ట్ అధికారి శివప్రసాద్ మృతి

Advertisement

Next Story