Nellore: ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి కిడ్నాప్

by srinivas |
Nellore: ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి కిడ్నాప్
X

దిశ, నెల్లూరు:ఊయలలో నిద్రిస్తున్న ఓ చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘంలో జరిగింది. స్థానికులు మణికంఠ, అనూషలకు నాలుగేళ్ళ క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనూష తన కూతురు లక్ష్మిని ఊయలలో పనుకోబెట్టారు. తల్లి అనూష అక్కడే పనుకున్నారు. ఉదయం లేచి చూసే సరికి కూతురు కనిపించలేదు. పాప స్థానంలో ఊయలలో ఓ బొమ్మను పెట్టి ఉండడంతో చుట్టప్రక్కల ఆరా తీశారు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని అపహరించి ఉంటారని కుటుంబసభ్యులతో కలిసి అనూష బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story