- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: న్యాయం చేస్తామని గెంటేస్తారా?
- మా బిడ్డను తెచ్చిస్తారా.. ఆదుకుంటారా?
- ర్యాగింగ్ భూతానికి బలైన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆదుకుంటామని విద్యార్థి కుటుంబానికి కాలేజీ ప్రిన్సిపాల్ మాటిచ్చారు. ఆ కాలేజీ కావలి ఎమ్మెల్యేది కావడంతో ఆయనతో కూడా ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన కూడా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు లక్ష్మీకుమారి, పెంచలయ్య నమ్మారు. దీంతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. అయితే తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే సీఐతో మాట్లాడుకోవాలని తమను పోలీసులతో గెంటించారని వాపోయారు. నాడు ఎమ్మెల్యేతో మాట్లాడిచ్చిన ప్రిన్సిపాల్ సైతం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.