- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kavali: ఏసీబీ వలలో అవినీతి అధికారి
by srinivas |
X
దిశ, నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా కావలి పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుడ్లూరు మండలానికి చెందిన మాధవరెడ్డి కొన్ని పనులు చేశారు. ఆ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల కోసం ఆయన కావలి పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం చుట్టూ తిరిగారు.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మనోజ్ కుమార్ రూ. 27 వేలు లంచం ఇస్తే బిల్లులు చెల్లిస్తామంటూ బేరంపెట్టారు. అసలే బిల్లులు ఆలస్యమై ఇబ్బందుల్లో ఉన్న మాధవరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం బాధితుడు మాధవరెడ్డి జూనియర్ అసిస్టెంట్ మనోజ్ కుమార్‌కు రూ. 27 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Advertisement
Next Story