- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దూసుకుపోతున్న యువ నేతలు.. Chandrababu పిలిపించుకుని మెచ్చుకోవడంతో...
వారంతా యవతరం.. ప్రజలకు సేవ చేయాలనే వజ్ర సంకల్పం. టీడీపీ అంటే అభిమానం. సేవ చేస్తాం అంటే పార్టీ పెద్దలు ఆహ్వానించలేదు. నిరుత్సాహపడక అభిమానించే టీడీపీలోనే సేవ చేసుకుందామనే ఆలోచనతో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రారంభించారు. అధినేత చంద్రబాబు చేత శభాష్ అనిపించుకున్నారు. స్వయంగా ఆయనే పిలిచి ఘనంగా సత్కరించారు. నారాలోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: 2014లో పార్టీకి సేవ చేయాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొందరు యువకులు సిద్ధమయ్యారు. అప్పట్లో స్థానిక నేతలు సహకరించకపోవడంతో ఎలాగైనా తమ సేవలను అధినేత చంద్రబాబు గుర్తించాలని కంకణం కట్టుకొన్నారు. నారాలోకేష్ యువజన ఫౌండేషన్ ప్రారంభింభించారు. మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామాల్లో ఉచిత అన్నదానాలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేయడంతో ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న అన్నదానానికి మంచి గుర్తింపు వచ్చింది.
మరింతగా పెంచిన సేవలు
మొబైల్ క్యాంటీన్లకు మంచి పేరు రావడంతో సేవలు మరింత విస్తృతం చేశారు. పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ పేరిట జనార్దన్ క్యారేజీ అనే పేరు పెట్టి నిత్యం 30 క్యారేజీలు సిద్దం చేస్తున్నారు. పేదలకు, యాచకులకు, అనాథలకు, వృద్ధులకు పంపిస్తున్నారు. అలాగే, నిరుపేదలను, దివ్యాంగులను ఎంపిక చేసి నెలకు రూ.500 చొప్పున ఆర్థికసాయం ప్రతి నెలా పది మందికి ఇస్తున్నారు. వేసివలో చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో అనేక కుటుంబాలకు కూరగాయాలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు మెచ్చుకున్నారు..
మేము చేస్తున్న సేవలను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరికి రావాలని కబురు పంపించారు. ఎంతగానో అభినందించారు. మరింత సేవ చేయాలనే సూచించారు. ఇటీవల లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి గొల్లపాలెంలో ఓ కుటుంబానికి టీ పాయింట్ అందించారు. దీంతో వారు జీవనోపాధి పొందుతున్నారు. మా సేవలు మరింతగా విస్తృతం చేస్తాం.
- మందపాక సుబ్బారావు(సుబ్బు), నారాలోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు
Also Read...