పాదయాత్రకు విశేష స్పందన.. లోకేష్‌తో కలిసి నడిచిన ఆరవిల్లి

by samatah |
పాదయాత్రకు విశేష స్పందన.. లోకేష్‌తో కలిసి నడిచిన ఆరవిల్లి
X

దిశ, ( తణుకు ) : లోకేష్ పాదయాత్రకు జనంలో విశేష స్పందన లభిస్తుందని తణుకు టిడిపి ఆన్ఛార్జి ఆరవిల్లి రాధాకృష్ణ అన్నారు. శ్రీకాళహస్తి నియోజ‌క‌వ‌ర్గంలో 22వ రోజు న కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలందరినీ కలుసుకుంటూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తునటువంటి ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు.

నారా లోకేష్ పాదయాత్రకు వస్తునటువంటి ప్రజలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ కు, వైసీపీ పేటియం బ్యాచ్ కు ప్యాంట్లు తడిసిపోతున్నాయి అని అన్నారు. అదేవిధంగా పాదయాత్ర చూస్తుంటే వైసీపీ నాయకులకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. అధికార అహంకారంతో పోలీసులను అడ్డుపెట్టుకొని అన్ని విధాలుగా కూడా లోకేష్ గారు పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని దురాలోచనతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.అదేవిధంగా లోకేష్ కాన్వాయ్ ని లాక్కోవడం, మైక్ లాకోవటం ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి ఙేచేస్తున్నటువంటి సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ప్రతిపక్షంలో జగన్ రెడ్డి పాదయాత్రకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా కూడా సహకరించారని అన్నారు.. ఈ ప్రభుత్వం పాదయాత్రకు సహకరిస్తే పాదయాత్ర సహకరరించకపోతే దండయాత్ర చేస్తారని అని అన్నారు. ఈ విధంగా ఈ పాదయాత్రను ఎన్ని విధాలుగా కూడా అడ్డుకోవాలనుకున్న సరే ఈ పాదయాత్ర 4000 కిలోమీటర్లు 400 రోజులు దిగ్విజయంగా పూర్తి చేస్తారని అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలో ఉందని అన్నారు. రాబోయే కాలంలో మరల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఐతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

Next Story

Most Viewed