ధవళేశ్వరంలో దగ్ధమైన పత్రాలు పనికిరానివి... తేల్చిసిన స్పెషల్ కలెక్టర్

by srinivas |
ధవళేశ్వరంలో దగ్ధమైన పత్రాలు పనికిరానివి... తేల్చిసిన స్పెషల్ కలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ పత్రాలు దగ్ధమయి కనిపించడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది. పలు కార్యాలయాల్లో ఫైళ్లు అనుమానాస్పదంగా దహనమైన నేపథ్యంలో ఇది కూడా ఆ కోవలోనే జరిగిందంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైళ్లను మాయం చేయడంతో పాటు దగ్ధం చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు వైసీపీ నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫైళ్ల దగ్ధంపై ఆధారాలుంటే కేసులు పెట్టొచ్చని, అబద్ధాలను నిజం చేయాలని ఎంతకాలం ప్రయత్నిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.


ఇదిలా ఉంటే ఫైళ్ల దగ్ధం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైళ్లు దగ్ధం జరిగిన ప్రాంతాన్ని పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళ పరిశీలించారు. ఫైళ్ల దగ్ధంపై అధికారుల నుంచి ఆరా తీశారు. అయితే దగ్ధమైన పత్రాలు ఉపయోగంలో లేనివని అధికారులు స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉన్న పేపర్లను మాత్రమే తగలబెట్టామని తెలిపారు. పోలవరం ఎడమకాలువ పరిహారం ఫైల్స్ కాదని చెప్పారు. పోలవరం LMC ఆఫీసులో పనికిరాని కాగితాలనే పడేశామన్నారు. ఆ పేపర్లతో ఆర్ అండ్ ఆర్కు సంబంధం లేదని తెలిపారు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివని స్పెషల్ కలెక్టర్ సరళ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed