- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో నారా లోకేష్ కూడా అరెస్ట్..? సీఐడీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ పాత్ర కూడా ఉందని, త్వరలోనే ఆయనను కూడా విచారిస్తామని సంజయ్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. లోకేష్ పాత్రను కూడా బయటపెడతామని, ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా నారా లోకేష్ పాత్రపైన విచారణ చేస్తామని చెప్పారు.
ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ మళ్లింపులో లోకేష్ పాత్ర ఉందని తేలిందని సంజయ్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఆరు గంటలకు చంద్రబాబుతో అధికారులు మాట్లాడారని, హెలికాప్టర్‌లో తీసుకొస్తామంటే చంద్రబాబు వద్దన్నారని తెలిపారు. రోడ్డు మార్గాన చంద్రబాబును విజయవాడకు తీసుకొస్తున్నామని, వైద్య పరీక్షలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సాయంత్రంలోపు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని, ఆయన వయస్సు, హోదాను తాము గౌరవిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు.
నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కోనసీమ జిల్లాలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సీఐడీ చీఫ్ వ్యాఖ్యలతో త్వరలోనే లోకేష్‌ను కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేస్తారేమోననే టెన్షన్ టీడీపీ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తే యువగళం పాదయాత్ర నిలిచిపోయే అవకాశముంది. దీంతో చంద్రబాబుతోనే సరిపెడతారా..? లేదా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయా? అనేది టీడీపీ వర్గాలను ఆందోళన కల్గిస్తోంది.