YS Vijayamma: వైఎస్ విజయ్మకు శుభాకాంక్షలు చెప్పిన కొడుకు, కూతురు..

by Indraja |   ( Updated:2024-04-19 12:45:15.0  )
YS Vijayamma: వైఎస్ విజయ్మకు శుభాకాంక్షలు చెప్పిన కొడుకు, కూతురు..
X

దిశ వెబ్ డెస్క్: నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కుమార్తె ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయమ్మకు పుట్టి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ హ్యాపీ బర్త్‌డే అమ్మ అని ట్వీట్ చేసి తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తన తల్లిపై తనకున్న ప్రేమను తెలిపారు. అయితే కలిసిమెలిసి ఉండాల్సిన కన్నబిడ్డలు పదవులకోసం పోటీపడుతూ, ఒకరినొకరు దూషించుకుంటుంటే.. రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్ధమవ్వక ఆమె అమెరికా వెళ్లిపోయారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read More..

Breaking: కాకినాడ సభకు చేరుకున్న సీఎం జగన్

Advertisement

Next Story