స్కిల్ స్కామ్ కేసు : రంగంలోకి సుప్రీంకోర్టు న్యాయవాదులు

by Seetharam |   ( Updated:2023-09-19 05:50:06.0  )
స్కిల్ స్కామ్ కేసు : రంగంలోకి సుప్రీంకోర్టు న్యాయవాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మంగళవారం హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ క్యాష్ పిటిషన్‌పై బలంగా వాదనలు వినిపించేందుకు అటు సీఐడీ తరఫు న్యాయవాదులు ఇటు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరఫున అటు సీఐడీ, హైకోర్టులలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం జరిగే విచారణలో సిద్ధార్థ లూథ్రాతోపాటు అగర్వాల్ సైతం వాదనలు వినిపించనున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే ఏపీ హైకోర్టుకు చేరుకున్నారు. అయితే వర్చువల్‌గా న్యాయవాది హరీశ్ సాల్వే సైతం వాదనలు వినిపంచనున్నారు. మరోవైపు సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వర్చువల్‌గా వాదనలు వినిపించనున్నారు. వర్చువల్‌గా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నాం 12 గంటలకు హైకోర్టులో వాదనలు జరగనున్న నేపథ్యంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ పలువురు టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More: చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ

Advertisement

Next Story