సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ కేసు: రేపు వాదనలు వింటామన్న సీజేఐ బెంచ్

by Seetharam |   ( Updated:2023-09-25 06:01:43.0  )
సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ కేసు: రేపు వాదనలు వింటామన్న సీజేఐ బెంచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ త్వరగా చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐను కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో రిమాండ్‌లో ఉన్నారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు వివరించారు. ఏపీలో ప్రతిపక్షాలను అణిచివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని..తప్పుడు కేసులు పెట్టి జైలుపాల్జేసిందని ఆరోపించారు. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరంగా క్వాష్ పిటిషన్‌పై విచారణ జరపాలని సీజేఐను అభ్యర్థించారు.

సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తిపై సీజేఐ చంద్రచూడ్ బెంచ్ స్పందించింది. ఎందుకు అత్యవసరంగా ఈ కేసును విచారించాలని సీజేఐ ప్రశ్నించారు. ఈనెల 8న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఇప్పటి వరకు ఆయన రిమాండ్ లో ఉన్నారని తెలిపారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. అలాగే ఈనెల 28 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈకేసు విచారణను అత్యవసరంగా విచారించాలని సీజేఐ బెంచ్‌ను అభ్యర్థించారు. అయితే కేసుకు సంబంధించి మంగళవారం విచారణకు మెన్షన్ లిస్ట్‌లో చేర్చిన నేపథ్యంలో ఈ కేసు విషయమై రేపు వాదనలు వింటామని సీజేఐ బెంచ్ తెలిపింది. ప్రస్తావన జాబితాతో మంగళవారం రావాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.

Read More Latest Updates from Andhra Pradesh News

Read More : జేసీ వర్సెస్ కేతిరెడ్డి: ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

Advertisement

Next Story

Most Viewed