తిరుపతి కొండకు చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం

by Mahesh |
తిరుపతి కొండకు చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఇందులో డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు, ఎస్పీ (అడ్మిన్‌) వెంకటరావు, డీఎస్పీలు జి.సీతారామరావు, శివనారాయణ స్వామి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ టి.సత్య నారాయణ, ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.ఉమామహేశ్వర్‌, కల్లూరు సీఐ ఎం.సూర్య నారాయణను సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ సిట్ బృందం శనివారం మధ్యాహ్నం తిరుపతి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో భేటీ అయిన సిట్‌ బృందం అధికారులు.. వచ్చి రాగానే విచారణ ప్రారంభించారు. అలాగే కల్తీ నెయ్యి పై టీటీడీ ఫిర్యాదును సిట్ చీఫ్ త్రిపాఠి పరిశీలించారు. అనంతరం వారు టీటీడీ మార్కెటింగ్ అధికారులతో చర్చించారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారించేందుకు సిట్ బృందం మూడు రోజుల పాటు తిరుపతి కొండపైనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed