టీటీడీ ఈవోతో సుధీర్ఘ భేటీ.. సిట్ సంచలన నిర్ణయం

by srinivas |
టీటీడీ ఈవోతో సుధీర్ఘ భేటీ.. సిట్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ(Tirumala Laddu adulterated)ఘటనపై విచారణ చేపట్టేందుకు సిట్ బృందం(SIT Team)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో సిట్ బృందం దూకుడు పెంచింది. తిరుమలలో విచారణ చేపట్టింది. టీటీడీ ఈవో శ్యామలరావు(TTD Eo Shyamala Rao)ను సిట్ అధికారులు కలిశారు. లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ(AR Dairy)కి సంబంధించిన కేసుపైనా ఈవోతో చర్చించారు.

అయితే సిట్ అధికారులు అంతా ఒకే చోట కాకుండా బృందాలుగా విడిపోయి విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సైతం ఈవో దృష్టికి సిట్ సభ్యులు తీసుకెళ్లారు. ప్రధానంగా కేసు విషయంలో తాము ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నామనే విషయాలపైనా ఈవోతో చర్చించారు. ఈ కేసులో చాలా కీలకమైన ఆధారాలు సేకరించాలని, ఇందుకోసం తిరుపతి, తిరుమల, టీటీడీ గోదాములు, తమిళనాడు ఏఆర్ డెయిరీతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుందని ఈవోకు వివరించారు. అంతేకాదు అన్ని చోట్లకు అందరూ కలిసి వెళ్లకుండా బృందాలుగా విడిపోయి విచారణ చేపడతామని శ్యామలరావుకు సిట్ సభ్యులు తెలిపారు. నెయ్యి టెండర్లు(Ghee Tenders), ఎన్‌డీడీబీ (NDDB) రిపోర్టు వచ్చినంత వరకూ జరిగిన పరిణామాలపై ఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈవోతో భేటీ అనంతరం సిట్ టీమ్ పద్మావతి అతిథి గృహానికి వెళ్లిపోయారు. సోమవారం నుంచి ఈ కేసు విచారణను సిట్ సభ్యులు మరింత ముమ్మరం చేయనున్నారు.

Advertisement

Next Story