జగన్ సర్కార్‌కు షాక్: ఈనెల 27లోపు బిల్లులు చెల్లించకపోతే ఆ సేవలు బంద్

by Seetharam |   ( Updated:2023-11-14 05:53:52.0  )
AP government
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ షాక్ ఇచ్చింది. ఈనెల 27లోపు బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లైంది. ఇకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయని ఆరోపించింది. ఈ నెల 27లోపు బిల్లులు విడుదల చేయాలని లేని పక్షంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద సేవలను నిలిపేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో తక్షణమే బిల్లులు చెల్లించాలని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శికి అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీకృష్ణ లేఖ రాశారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోషియేషన్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story