ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన కీలక ప్రజా ప్రతినిధులు

by srinivas |   ( Updated:2024-08-11 16:07:24.0  )
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన కీలక ప్రజా ప్రతినిధులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ మళ్ల జయమ్మతో పాటు వైస్ ఎంపీపీ బోజలక్ష్మి, రాజుపేట సర్పంచ్ కిల్లాడి వేముడులు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో వారంతా జనసేన కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యానారాయణ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. మరోవైపు కూటమి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తేలలేదు. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగియనుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ నేతలు పీలా గోవింద్ లేదా గండి బాబ్జికి అవకాశం దక్కు ఛాన్స్ ఉందని టీడీపీ వర్గీయులు అంటున్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం పది స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed