గొడ్డలితో నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్.. వదినపై YS షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-05-08 06:54:22.0  )
గొడ్డలితో నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్.. వదినపై YS షర్మిల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సోదరుడు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఎప్పుడూ సింగిల్ ప్లేయర్‌గా వాళ్లే అధికారంలో ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డలితో మిగతా వాళ్లను అందరిని నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్‌గా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఓటమి భయంతో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఊరుదాటేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. దేశం విడిచి వెళ్లేందుకు అతడు పాస్ పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఓడితే అరెస్ట్ తప్పదని భయంతో అవినాష్ రెడ్డి ఉన్నాడని అన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిస్తే నేరం గెలిచినట్లేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప ప్రజలకు నిత్యం ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story