AP Politics:కొంగు చాచి అడుగుతున్నా..షర్మిల ఎమోషనల్ పోస్ట్!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-02 12:53:51.0  )
AP Politics:కొంగు చాచి అడుగుతున్నా..షర్మిల ఎమోషనల్ పోస్ట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపిలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీల నేతలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల సొంత అన్న చెల్లెలు అయినప్పటికి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగు సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తాను వైఎస్‌ఆర్ బిడ్డను అని అందుకే వివేకా హత్య కేసులో న్యాయం వైపు నిలబడినట్లు కాంగ్రెస్ చీఫ్ షర్మిల తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు న్యాయం వైపా..?అన్యాయం వైపా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలందరూ న్యాయం వైపు నిలబడాలని అందుకు నేను కొంగుచాచి అడుగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరినీ న్యాయం కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే జగన్ మాత్రం వివేకా హత్య నిందితులకు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

Read More..

ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఫిక్స్

Advertisement

Next Story