- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
YS Jagan: అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయండి : జగన్ పై షర్మిల ఫైర్
దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ (YS Jagan) పై ఏపీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ ప్రకటించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనివారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్ట్ కాదన్నారు షర్మిల. ప్రజల తరఫున నిలబడలేనప్పుడు అలాంటి పదవి ఆయనకు అవసరం లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.