- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: క్రిస్టియన్ అయ్యి.. మతతత్వ బీజేపికే జై కొట్టావ్!.. వైఎస్ శర్మిల సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి జగన్ గారూ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్నారని, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలో చెప్పాలని ఫైర్ అయ్యారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..?, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? అని సంచలన ఆరోపణలు చేశారు.
అలాగే 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు.. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేగాక క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారని చెబుతూ.. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం అంటూ.. మీ నిరసనలో స్వలాభం తప్ప, నిజం లేదని, రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని తేల్చి చెప్పారు. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అని శర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.