నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్ అరెస్ట్

by Sathputhe Rajesh |
నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. రవీంద్రారెడ్డిని కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. చైల్డ్ లైన్ అధికారులు హాస్టల్‌లో విచారణ చేపట్టారు. చైల్డ్ లైన్ నివేదిక ఆధారంగా కాలేజీపై చర్యలు చేపట్టనున్నారు. నిందితుడిపై 354ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే అంబాపురం నవోదయ పారా మెడికల్ కాలేజీ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ రవీంద్రరెడ్డి కోరికలు తీర్చాలంటూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. విద్యాభ్యాసం ముగియడంతో టీసీ కోసం వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ వేధించాడు. తన కోరికలు తీరిస్తేనే టీసీ ఇస్తానని రవీందర్ రెడ్డి బెదిరించాడని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ పై పోలీసులకు ఓ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

Next Story