- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప తాజా సర్వే... వైఎస్ షర్మిల అంత పని చేసిందా..?
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే13న ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌లో ప్రజలు భారీగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో అభ్యర్థుల భవిత్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ 14న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానంగా మూడు స్థానాల్లో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నారా లోకేశ్ బరిలోకి దిగిన మంగళగిరి, వైఎస్ షర్మిల పోటీ చేసిన కడప ఎంపీ స్థానంపై అందరి చూపు ఉంది. మరీ ముఖ్యంగా కడప ఎంపీ స్థానం వైపే భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ స్థానంలో అసెంబ్లీ పరిధిలో వైఎస్ జగన్ పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగారు.
కడప జిల్లాలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఇక్కడ అసెంబ్లీ స్థానంలో జగన్ గెలుపు ఖాయమే అయినా పార్లమెంట్ స్థానంలో మాత్రం పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీకి, కాంగ్రెస్, టీడీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కడప అసెంబ్లీ, పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఓటు బ్యాంకు ఆ పార్టీకే నమోదు అయినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వైఎస్ షర్మిలకు ప్రధానంగా క్రిస్టియన్లు, ముస్లింలు గంప గుత్తగా ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన రిజర్వేషన్ల కారణంగా ముస్లిం మైనార్టీ మొత్తం షర్మిలకే మద్దతు తెలిపినట్లు సమాచారం. క్రిస్టియన్లు అసెంబ్లీ పరిధిలో వైసీపీకి, పార్లమెంట్ పరిధిలో షర్మిలకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
ఇక అవినాశ్ రెడ్డి విషయానికి కొచ్చేసరకి వైఎస్ జగన్‌ను చూసి ఓటు వేయాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణులు ఎదుర్కొంటున్నారు. దీంతో కడప పార్లమెంట్ పరిధిలో భారీగా ఓట్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఓటు అంతా వైఎస్ షర్మిలకే పడినట్లు వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. కడప, బద్వేల్, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అసెంబ్లీకి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఇక పార్లమెంట్ పరిధిలో ఓటర్లు ఎక్కువగా షర్మిల వైపు చూసినట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ట్రయాంగిల్ ఫైటింగ్‌లో షర్మిల చేసిన క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచబోతోందో చూడాలి.