డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన వైసీపీ మాజీ నేత.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-19 13:22:10.0  )
డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన వైసీపీ మాజీ నేత.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వైఎస్సార్సీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు(YCP Leaders) పార్టీని వీడి అధికార పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు నేతలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేడు(గురువారం) జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ను(Pawan Kalyan) కలిశారు. తాము జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌పై సంచలన విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌కు విశ్వసనీయత(Credibility) లేదని, వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు వైఎస్ జగన్‌ను(YS Jagan) గెలిపించాలని ఆనాడు రాజీనామాలు(Resignations) చేశామని గుర్తుచేశారు. కానీ ఇచ్చిన మాటను ఆయన మరిచిపోయారని ధ్వజమెత్తారు. సభల్లో జగన్‌(YS Jagan) ఎప్పుడూ నా గురించి మాట్లాడలేదని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) తన గురించి మాట్లాడారని ప్రశంసించారు. తనపై పవన్‌ ఎంతో అభిమానంతో ఉన్నారని కొనియాడారు. పవన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. తనతోపాటు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలిసి జనసేనలో(Janasena) చేరుతారని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

Read More..

AP News:విజయవాడ చేరుకున్న బాలినేని.. పవన్‌తో భేటీకి మరో నేత కూడా రెడీ!

Advertisement

Next Story