Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతికి మెయిన్ రీజన్ అదే.. రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-26 11:46:54.0  )
Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతికి మెయిన్ రీజన్ అదే.. రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరణంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కొల్లు రవీంద్ర అసెంబ్లీలో మాట్లాడారు. గత ఐదేళ్లలో ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు మద్యం విక్రయాలు జరిపారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బూమ్ బూమ్ బీరు తాగే రాకేశ్ మాస్టర్ మృతిచెందాడని కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బీరు తాగే ముందు.. తాగుతున్న సమయంలో ఏదో తేడాగా ఉందంటూ ఆయన చేసిన వీడియోల్లోనూ చెప్పారని గుర్తుచేశారు.


తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే బూమ్ బూమ్ బీర్లు తప్పా మరేమీ దొరకడం లేదని రాకేశ్ మాస్టర్ మాట్లాడిన మాటలను చెప్పారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని మంత్రి తెలిపారు. వైసీపీ సర్కార్‌లో అన్నింట్లోనూ నాణ్యత లోపించిందని అన్నారు. కాగా, రాకేశ్ మాస్టర్ దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. 2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు.

Advertisement

Next Story