నన్ను గెలిపించకపోతే చచ్చిపోతా: టీడీపీ అభ్యర్థి కందుల సంచలన వ్యాఖ్యలు

by srinivas |
నన్ను గెలిపించకపోతే చచ్చిపోతా: టీడీపీ అభ్యర్థి కందుల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. లేదంటే తాను చనిపోతానని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మర్కాపురంలో పర్యటించారు. టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తరపున ఓట్లు అభ్యర్థించారు. అయితే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలకు తనకు చావో రేవో అని చెప్పారు.

అయితే కందుల నారాయణరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలిపించకపోతే చనిపోతానని అనడం బెదిరించడమేనని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఓట్లు అభ్యర్థించాలి కాని.. ఇలా బెదిరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓటమి తెలిసిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story