- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ మీడియాకు చెప్పుకోలేను.. రాజీనామాకు ముందు మోపిదేవి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. వైసీపీకి రాజీనామా చేయడం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నీ మీడియా ముందు చెప్పుకోలేదు అని అన్నారు. ప్రస్తుతానికి తాను, బీద మస్తాన్ రావు రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీకి రాజీనామా చేయాలని తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తనకు ఉందని జగన్‌తో మాట్లాడాను.. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా కుదరదు అన్నారు.
అప్పటినుంచే అసంతృప్తిగా ఉన్నాను. ఆ సమయంలోనే నిర్ణయం కూడా తీసుకున్నాను. అప్పుడే ప్రకటించడం కరెక్ట్ కాదని.. అధిష్టానంలో మార్పు వస్తుందని భావించాను. కానీ, ఎంత ఎదురుచూసినా ఫలితం లేదు అనిపించిన తర్వాతే ఇప్పుడు నిర్ణయం ప్రకటించాను’ అని మోపిదేవి అన్నారు. ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాము.. మంత్రి ఇచ్చాము.. అని మాట్లాడుతున్నారు. కానీ, అంతకంటే ముందు జగన్ కోసం తాను చేసిన త్యాగాలను మాత్రం ఎవరూ గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. దాని నుంచి కోలుకోకముందే ఇద్దరు ఎంపీలు షాకివ్వడం పార్టీ శ్రేణులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.