YS Jagan: కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-07-26 10:58:21.0  )
YS Jagan: కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ చేసిన ఆందోళనకు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వచ్చాయి. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదని ప్రశ్నించారు.

మణిపూర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్‌కు మణిపూర్‌లో ఒక రూల్.. ఏపీలో మరో రూలా అని నిలదీశారు. మణిపూర్ తరహా పరిస్థితే ప్రస్తుతం ఏపీలో కూడా ఉంటే ఎందుకు రియాక్ట్ కావడం లేదని క్వశ్చన్ చేశారు. ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీతో కాంగ్రెస్‌కు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య లింకేంటి ఆ అనబంధంపై వాళ్లనే అడగాలన్నారు. ఏపీలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.

కాగా, ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి, ప్రధాని జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. జగన్‌కు ధర్నాకు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శివసేన, డీఎంకే, అన్నాడీఎంకే ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. అయితే, ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నా విషయంలో సైలెంట్‌గా ఈ నేపథ్యంలో జగన్ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story