నన్ను చంపేందుకు కుట్ర.. మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |
నన్ను చంపేందుకు కుట్ర.. మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: తనను అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ కోరారు. ఈ మేరకు హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు అందించిన భద్రత యొక్క ప్రాముఖ్యతను జగన్ గుర్తుచేశారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన భద్రతకు ఇది చాలా కీలకమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని, అది కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సహజ న్యాయం సూత్రాలను ఉల్లంఘించి భద్రత తగ్గింపుపై తనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని జగన్ పిటిషన్‌లో తెలిపారు. తన భద్రత తగ్గింపుకు చట్టబద్దంగా సమర్ధించుకునే అవకాశం కూడా లేదన్నారు. దీనిని పునరుద్ధరించాలని జగన్ తన పిటిషన్‌లో కోరారు.

Advertisement

Next Story