AP Elections 2024: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మాట వాస్తవమే.. ఎంపీ కృష్ణదేవరాయులు ఆసక్తికర వ్యాఖ్యలు

by Indraja |   ( Updated:2024-01-06 09:47:22.0  )
AP Elections 2024: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మాట వాస్తవమే.. ఎంపీ కృష్ణదేవరాయులు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డిస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసిన ప్రస్తుతం ఇదే చర్చ. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మీడియా తో మాట్లాడుతూ తాను సీఎం జగన్ ను కలిసిన మాట వాస్తవం అని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో తాను జగన్ ను కలవాల్సి వచ్చిందని.. తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.

ఈ విషయం పైన చర్చించేందుకే సీఎం జగన్ ను కలిసినట్లు తెలిపారు. అనంతరం తన నిర్ణయాన్ని జగన్ కు తెలిపినట్లు వెల్లడించిన ఎంపీ.. తనకు పల్నాడులో పూర్తి చెయ్యాల్సిన పనులు చాల ఉన్నాయని.. సగం సగం పనులు చేసి వెళ్లిపోవడం సబబు కాదని.. సగంలో మిగిలిపోయిన పనులను చెయ్యాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అలానే అధిష్టానం లెక్కలు అధిష్టానానికి ఉంటె.. నా ఆలోచనలు నాకుంటాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకి వేరే ప్రాంతం నుండి పోటీ చేసే ఉద్దేశం లేదని.. తాను వేరే స్తానం నుండి పోటీ చేయడానికి ఎందుకు సిద్ధంగా లేనో చేప్పాను అన్నారు. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed