కేశినేని నానితో టీడీపీ సీనియర్ నేత భేటీ..

by Indraja |
కేశినేని నానితో టీడీపీ సీనియర్ నేత భేటీ..
X

దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ టికెట్ దక్కని నేతలు ఉన్న పార్టీకి బైబై చెప్పి మరో పార్టీకి మకాం మార్చేస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి చేరగా.. వైసీపీ నేతలు కొందరు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ సైకిల్ దిగి ఫ్యాన్ గాలి వైపు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన కేశినేని నానితో రాత్రి భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో తాను వైసీపీలో చేరే అంశంపై నానితో చర్చించారని సమాచారం. అయితే తుది జాబితా ప్రకటన రాక ముందే టీడీపీ అధిష్టానం వైకిరిపై అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక వైసీపీలో చేరాలి అనుకుంటున్న టీడీపీ అసంతృప్త నేతలకు వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైసీపీతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story