- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: మరింత హీటెక్కిన కాపు రాజకీయం.. ముద్రగడపై హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కాపు రాజకీయం హీటెక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో కాపు నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చాలా రోజులు తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు ముద్రగడను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ముద్రగడ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్‌పై తాను పోటీ చేస్తానని ముద్రగడ సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంపై కాపు సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధికోసమే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేపట్టారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసింది సున్నానేనని విమర్శించారు. ముద్రగడకు పవన్ విమర్శించే స్థాయి లేదని హరి రామ జోగయ్య వ్యాఖ్యానించారు. కాపుల కోసం పవన్ కల్యాణ్ పార్టీ పెట్టలేదని చెప్పారు. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.