AP News:సత్తెనపల్లిలో గుర్తింపు లేని పురుగు మందుల పట్టివేత

by Jakkula Mamatha |
AP News:సత్తెనపల్లిలో గుర్తింపు లేని పురుగు మందుల పట్టివేత
X

దిశ,పల్నాడు: సత్తెనపల్లిలో గుర్తింపు లేని పురుగు మందుల దుకాణాల పై సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ఒక గౌడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన గుర్తింపు లేని పురుగు మందుల నిల్వలు అధికారులు గుర్తించారు. శివ శంకర ఫర్టిలైజర్ పురుగు మందుల లైసెన్స్ పత్రాలు గోడౌన్ అడ్రస్ జతపరిచి లేనందున పురుగు మందులు మొత్తాన్ని అనధీకృత పురుగు మందులుగా అధికారులు గుర్తించారు.

మొత్తం రూ.5 లక్షల 85 వేల విలువ చేసే పురుగు మందులను సీజ్ చేశారు. సీజ్ చేసిన పురుగు మందులను నాణ్యత పరీక్షల కోసం ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక శాంపిల్ సేకరించి లాబ్‌నకు పంపిస్తామని ఏడి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన పురుగు మందులను భద్రత నిమిత్తం ఆదిత్య సీడ్స్ అనే పురుగు మందుల షాపు ఉంచినట్లు వెల్లడించారు. సేఫ్ కస్టడీ ఆర్డర్ కొరకు కోర్టునకు సమర్పించినట్లుగా తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed