Breaking:ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

by Jakkula Mamatha |   ( Updated:2024-06-18 17:33:56.0  )
Breaking:ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు తాజాగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. జూలై 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 5 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జూలై 12వ తేదీన ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా, టీడీపీలో చేరడంతో సి. రామచంద్రయ్య పై అనర్హత వేటు పడడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

Read More..

BREAKING : పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధం..మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story