- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌదీలో ఆ ఐదు రోజులు నరకం చూపించారు: మెహరున్నీసా
దిశ, వెబ్ డెస్క్: విజయవాడకు చెందిన జుబేర్ దంపతులు ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం సౌదీ వెళ్లారు. అయితే అక్కడ నానా కష్టాలు పడ్డారు. భార్య భర్తలు ఇద్దరూ కూడా ఏజెంట్ల చేతిలో మోసపోయారు. వారితో వెట్టిచాకిరి చేయించారు. అంతేకాదు భార్యను ఒక చోట, భర్తను వేరే చోటకు తరలించారు. అయితే భర్త జుబేర్ తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన మంత్రి నారా లోకేశ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ.. సౌదీ ఎంబసీతో మాట్లాడారు. కానీ భార్య మాత్రమే విజయవాడకు చేరుకున్నారు. తన భర్త జుబేర్ అచూకీ తెలియకపోవడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను కూడా స్వగ్రామానికి చేర్చాలని భార్య మెహరున్నీసా కోరారు.
‘‘ఏజెంట్లు మమ్మల్ని మోసం చేశారు. చిన్న పిల్లలను చూసుకోవాలని సౌదీ తీసుకెళ్లారు. నన్ను మస్కట్ పంపించారు. ఐదుగురు వృద్ధులను చూసుకోవాలని చెప్పారు. అయితే వాళ్లు నాకు ఐదు రోజుల పాటు నరకం చూపించారు. నన్ను కొట్టారు, తిట్టారు. అసభ్యకరమైన ఫొటోలు తీశారు. ఫోన్ తీసేసుకున్నారు. అన్నం పెట్టలేదు. 5 రోజులు తర్వాత మరో మహిళ వద్దకు తీసుకెళ్లారు. అక్కడా ఐదు రోజులు ఉన్నా. ఆమె కూడా వేధింపులకు గురి చేశారు. చాలా ఇబ్బందులు పెట్టారు. వెళ్లిపోతామంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. విజయవాడ వచ్చేటప్పుడు నన్ను కొట్టారు. చాలా మంది ఆడవాళ్లను సౌదీ తీసుకెళ్లి మోసం చేస్తున్నారు. ఆ ఏజెంట్‌ను వదిలిపెట్టొద్దు.’’ అని మెహరున్నీసా డిమాండ్ చేశారు.