Vijayawada: ఇంద్రకీలాద్రీపై ఘనంగా శాకంబరీ ఉత్సవాలు!.. పండ్లు కూరగాయలతో ముస్తాబైన దుర్గమ్మ

by Ramesh Goud |
Vijayawada: ఇంద్రకీలాద్రీపై ఘనంగా శాకంబరీ ఉత్సవాలు!.. పండ్లు కూరగాయలతో ముస్తాబైన దుర్గమ్మ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై ఆషాడ మాసం శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ పండ్లు, కూరగాయలతో అలంకరించుకొని భక్తులకు శాకంబరీ దేవిగా దర్శనం ఇస్తుంది. విజయవాడ ఇంద్రకీలాద్రీపై శాకంబరీ ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పండ్లు కూరగాయలతో ఘనంగా అలంకరించారు. భక్తులు కానుకగా ఇచ్చిన కూరగాయలు, పండ్లతో అమ్మవారి మూలవిరాట్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూడు రోజుల పాటు దుర్గమ్మ భక్తులకు శాకంభరీ దేవిగా దర్శనం ఇవ్వనుంది. ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండటంతో ఉదయం నుంచే భక్తులు శాకంభరీ దేవిగా అలంకరించబడిన అమ్మవారిని చూసేందుకు క్యూ కట్టారు. ఈ మూడు రోజుల పాటు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో చేసిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపీణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శాకంభరి దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. దేశం పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో దుర్గమ్మను శాకంబరీ దేవిగా అలంకరించి కొలుస్తారు.

Advertisement

Next Story