- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుకున్నట్లే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది.. రుద్రరాజు
దిశ వెబ్ డెస్క్: తాజాగా వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. తాము రాజన్న బిడ్డ రావాలని.. ఆమె నేతృత్వంలో పని చెయ్యాలని కోరుకున్నట్లు తెలిపారు. అయితే ఇన్నాళ్లకు తమ కోరిక నెరవేరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ కేవీపీ రామచంద్రరావు పై గురుతర బాధ్యతను పెట్టిందని గుర్తు చేశారు.
ఇక పార్టీ సీనియర్ నేతలంతా వైఎస్ షర్మిలకు అండగా ఉండి ఆమెకు ఎల్లవేళలా సహకరిస్తాం అని తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ వదిలిన బాణం అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఏపీసీసీ అధ్యక్షకురాలిగా భాద్యతలు తీసుకునేందుకు వస్తున్న క్రమంలో ఆమె ప్రయణిస్తున్న కాన్వాయ్ ను అడ్డుకుని ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. దాదాపు 20 నిముషాలు వైఎస్ షర్మిల రోడ్డు పైనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వైకిరి పై అసహనానికి గురైన కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీతో పాటు ఇతర శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు అక్కడ నుండి వెళ్లేందుకు వైఎస్ షర్మిలకు అనుమతిచ్చారు. అవాంతరాల అనంతరం వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టారు.