రన్నింగ్ బస్ బోల్తా.. 19 మంది ప్రయాణికులకు గాయాలు

by Mahesh |
రన్నింగ్ బస్ బోల్తా.. 19 మంది ప్రయాణికులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గురైన బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళుతున్న సమయంలో కోమర్తి జంక్షన్ వద్ద బస్సు స్టీరింగ్ విరిగి పోవడంతో అదుపు తప్పి పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమదంలో బస్సు రోడ్డుకు అడ్డుగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story