దెబ్బతిన్న ఇంటికి రూ.10వేల తక్షణ సాయం: సీఎం జగన్

by Seetharam |
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని 8 జిల్లాలలో తీవ్ర ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. తుపాను ప్రభావంతో గాలులు, భారీగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాలు వల్ల దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారి పట్ల మానవతా ధృక్ఫధంతో సాయం చేయాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణమే రూ.10 వేలు ఇచ్చి... వారిని ఆదుకోవాలి అని సూచించారు. వారు కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేట్టు దయతో, సానుభూతితో అందించాలి. సకాలంలో పరిహారం అందించాలి. తుపాను తగ్గు ముఖం పట్టిన 48 గంటల్లో ఇవి చేయాలి. అప్పుడే వారికి సంతోషాన్ని ఇవ్వగలుగుతాం అని సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను సక్రమంగా వినియోగించుకుని బాధితులను గుర్తించడంతో పాటు నష్టాన్ని అంచనా వేయాలి. సకాలంలో వారికి ఇవ్వాల్సినవి అందించాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు..

ఒక్కఫోన్ కాల్‌దూరంలో ఉంటాం

తుపాను తీరం దాటి, వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టంపై వెంటనే ఎన్యూమరేషన్‌ పూర్తి చేయాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తుపాను ముప్పు తప్పిన అనంతరం ప్రజల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం సాయంపై ఆరా తీస్తానని సీఎం జగన్ తెలిపారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను...ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సంతృప్తకర స్ధాయిలో బాధితులందరికీ సహాయం అందాలి. ఈ విషయాన్ని కలెక్టర్లు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు కూడా జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు. సహాయచర్యల కోసం డబ్బులుకు సంబంధించి.. ఇంకా రూ.2 కోట్లు కంటే ఎక్కువ అవసరమైతే .. వెంటనే పంపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం అని సీఎం జగన్ వెల్లడించారు. సీఎస్‌, రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులంతా అందుబాటులో ఉన్నారు. ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. మీకు ఏం కావాలన్నా వెంటనే అడగండి. మీకు ఏం కావాలన్నా వెంటనే ఏర్పాటు చేస్తాం. అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి అని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లకు నిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed