RGV: ఫ్యాన్స్‌ను వెన్నుపోటు పొడిచి చంపేశారు..పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్

by srinivas |   ( Updated:2023-05-12 14:11:29.0  )
RGV: ఫ్యాన్స్‌ను వెన్నుపోటు పొడిచి చంపేశారు..పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులకు, అనుచరులకు ద్రోహం చేయడమే కాకుండా తనకు కూడా ద్రోహం చేశాడంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

ఆ రోజు చంద్రబాబు నాయుడు..ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈరోజు పవన్ కల్యాణ్ తన జనసైనికులను, తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్‌ అందరికీ రామ్ గోపాల్ వర్మ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన సొంత ఫ్యాన్స్‌నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడని విమర్శలు చేశారు. అంతేకాదు జనసేనాని వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పార్టీ, పిడికిలి, ఎర్రటి కండువాలు, వేళ్లు అని చెప్పడం చాలామంది ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆర్జీవీ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

వరల్డ్‌లోనే ఈ రికార్డ్ సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్!


Advertisement

Next Story