జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల కేటాయింపు పై ఆర్జీవీ రియాక్షన్

by Mahesh |   ( Updated:2024-02-24 09:55:43.0  )
జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల కేటాయింపు పై ఆర్జీవీ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన, టీడీపీ పొత్తులో బాగంగా క్లారిటీ వచ్చిన 118 స్థానాలను ఇరు పార్టీలు.. పంచుకున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ 94, జనసేన 24 స్థానాల్లో పోటి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా.. టీడీపీ మొదటి విడతలోనే మొత్తం 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన తన 24 లో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని జనసేనాని పవన్ కల్యాన్ తెలిపారు.అలాగే మరో 57 స్థానాల్లో బీజేపీతో చర్చలు జరిపిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎక్కువ స్థానాల్లో గెలవచ్చని తమ అభిప్రాయాలు చెబుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానలు ఇవ్వడంతో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్యేమార్గంగా 24 స్థానాలు ఇచ్చారని సెటైర్లు వేశారు.

Read More..

పవన్.. TDP ఉపాధ్యక్ష పదవి తీసుకో: జనసేనానిపై సజ్జల సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed