క్యాసినోపై ఆర్జీవీ హాట్‌ కామెంట్స్‌

by Disha Newspaper Desk |
క్యాసినోపై ఆర్జీవీ హాట్‌ కామెంట్స్‌
X

దిశ, ఏపీ బ్యూరో: వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ క్యాసినో వివాదంపై చేసిన ట్వీట్స్‌ దుమారం రేపుతున్నాయి. గుడివాడలో మంత్రి కొడాలి నానికి సంబంధించిన కన్వెన్షన్‌ హాల్‌లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. క్యాసినో ఎవరు నిర్వహించారో నిగ్గు తేల్చాలంటూ టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్‌ గురించి నేను గ్రేట్‌ జయమాలిని ద్వారా విన్నాను.

అలాగే, సీనియర్‌ ఎన్టీఆర్‌ గారు కూడా తన సినిమాలో ఆ పాటను అనుమతించారు అందుకే, క్యాసినో పై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి అని ట్వీట్‌ చేశారు. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్‌ నటించిన యమగోల సినిమాలోని గుడివాడ వెళ్లాను అనే వీడియో సాంగ్‌ను జత చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో జరిగే పరిణామాల పై ఆర్జీవీ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సినిమా టికెట్ల ధరల విషయంలో మంత్రి పేర్ని నాని తో చర్చలు జరిపారు. ఇప్పుడు ఈ క్యాసినో పై స్పందించారు. ఆర్జీవీ తీరుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story