- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డియే సీఎం: జగన్ ఇంటి దగ్గర వెలిసిన హోర్డింగ్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఎవరో అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాల్సి ఉంది. అయితే దాదాపు రేవంత్ రెడ్డియే తెలంగాణ సీఎం అని తెగ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు రేవంత్ రెడ్డియే సీఎం కావాలని పలువురు ప్రతిపాదనలు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో తెలంగాణ సీఎం ఎవరో అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఏపీలో రేవంత్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ సీఎం వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో భారీ కటౌట్ వెలిసింది. కోనేరు రాహుల్ చౌదరి అనే వ్యక్తి ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి అన్నకు హార్థిక శుభాకాంక్షలు అంటూ కోనేరు రాహుల్ చౌదరి ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి సమీపంలో ఈ కటౌట్ ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.