- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట... బట్ కండీషన్స్ అప్లై
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులలో బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతీ ఆదివారం కర్నూలు త్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఇకపోతే అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నాని, చల్లా బాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో టీడీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నలుగురు టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబుపై ఏడు కేసులు నమోదు కాగా కేవలం 4 కేసులకు మాత్రమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో మూడు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. బెయిల్ మంజూరైన సందర్భంగా టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలను నాలుగు వారాల పాటు అన్నమయ్య జిల్లాకు వెళ్లకూడదని కండీషన్లు పెట్టింది. అలాగే ప్రతీ ఆదివారం కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఇకపోతే ఈ ఘటనలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ముందస్తు బెయిల్ కోసం తాను ప్రయత్నించనని చంద్రబాబు తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.