మంత్రి రోజాకు రమ్యకృష్ణ సపోర్ట్ : బండారుది క్షమించరాని నేరంటూ మండిపాటు

by Seetharam |   ( Updated:2023-10-08 07:54:02.0  )
మంత్రి రోజాకు రమ్యకృష్ణ సపోర్ట్ : బండారుది క్షమించరాని నేరంటూ మండిపాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి ఆర్‌కే రోజా గతంలో బ్లూఫిల్మ్ చేసిందని ఆరోపించారు. ఆ వీడియోలు బయటపెడితే రోజా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపట్ల రోజా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు సినీ రంగం నంచి మద్దతు లభిస్తుంది. తాము అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, మీనా, కవితలు రోజాకు మద్దతుగా నిలిచారు. తాజాగా సినీనటి రమ్యకృష్ణ సైతం మద్దతుగా నిలిచారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. ఎమ్మెల్యే రోజాపై చేసిన అసభ్యకరంగా ఉన్నాయని.. ఆ వ్యాఖ్యలు తననున ఎంతో బాధించాయని అన్నారు. దేశం ఆర్థికంగా, నాగరికంగా ఎంత ఎదిగినా మహిళలపై అన్ని రంగాల్లోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయనీ, ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని రమ్యకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు నటి రమ్యకృష్ణ ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. రోజాపై ఇలా అసభ్యకరంగా దూషించడం చాలా బాధకరమని అభిప్రాయపడ్డారు. మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని..అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ నటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బండారు సత్యనారాయణమూర్తి చేసినది క్షమించరాని నేరంగా రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు.మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని ఇలాంటి తరుణంలో ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి ఇంతలా దారుణంగా వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం, లింగంతో సంబంధం లేకుండా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను అంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. తాను మహిళగా, నటిగా, తన స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని రమ్యకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రోజా-రమ్యకృష్ణ మంచి స్నేహితులు

ఇదిలా ఉంటే ఇటీవలే సినీనటటి రమ్యకృష్ణ ఇంటికి వెళ్లారు.రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా నగరిలో మంత్రి రోజాను కలిశారు. రమ్యకృష్ణకు రోజా దంపతులు ఘన స్వాగతం పలికారు. ఇక రమ్యకృష్ణ కి రోజా మంచిగా స్వాగతం పలికింది. దాంతోపాటు తమ ఇంట్లో భోజనం కూడా ఏర్పాటు చేశారు.ఆ తర్వాత రోజా రమ్యకృష్ణకు బొట్టు పెట్టి చీర పెట్టి సాగనంపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రమ్యకృష్ణ, తనను ఒక నక్షత్రంగా అభివర్ణించారు. ‘ఇద్దరు స్నేహితులు మంచి నక్షత్రాలు అని.. మీరు వారిని ఎప్పుడూ చూడరు.. కానీ ఎల్లప్పుడూ కూడా అక్కడే ఉన్నారని మీకు తెలుసు. ఈరోజుని చాలా అందంగా మార్చిన నక్షత్రానికి తాను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను అంటూ రోజా ట్వీట్ చేశారు. గతంలో తాము ఎంతో అందంగా, ఆనందంగా ఉండేవాళ్లమని ఎప్పుడు కలిసినా నవ్వుకుంటూ హాయిగా ఉండేవాళ్లమని మంత్రి రోజా గుర్తు చేశారు.

Advertisement

Next Story