- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాములోరి బ్రహ్మోత్సవం.. ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా అంకురార్పణ
దిశ ప్రతినిధి, కడప : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం కంకణ భట్టార్ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టమన్ను సేకరించారు. శుక్రవారం ధ్వజారోహణం, కవి సమ్మేళనం, శేష వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్లు వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పోతన భాగవత కవి సమ్మేళనం
టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన పోతన భాగవత కవి సమ్మేళనం ఆకట్టుకుంది. పోతన సాహిత్య పీఠం కార్యదర్శి నారాయణ రెడ్డి 'రుక్మిణి సందేశం', డాక్టర్ బీ గోపాలకృష్ణ శాస్త్రి 'శ్రీరామ జననం', డా. కే సుమన 'సీతారామ కల్యాణం', పీశంకర్ 'భక్తరసం', వీ చిన్నయ్య 'కుచేలోపాఖ్యానం', ఎం లోకనాథం 'శరణాగతితత్వం' అనే అంశాలపై ఉపన్యసించారు. కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్ రావు, ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, ఏఈవో రాములు, ప్రోగ్రాం అసిస్టెంట్ రామాచారి తదితరులు పాల్గొన్నారు.
5న కల్యాణం
శ్రీరామనవమి రోజు ఎక్కడైనా రాముని కల్యాణం జరుగుతుంది. అయితే ఒంటిమిట్టలో మాత్రం చంద్రుడు చూసేలా రాత్రివేళ శ్రీరాముని కల్యాణం నిర్వహిస్తారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన అంబటి
ఒంటిమిట్ట కోదండ రామునికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి మంత్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.