AP:రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Mamatha |
AP:రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్టీఆర్, రామోజీరావు యుగపురుషులని సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడ కానూరులో గురువారం రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రామోజీరావు ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని కొనియాడారు. రామోజీరావు ప్రజాహితం కోసమే రాజీలేని పోరాటం చేశారన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎనలేని కృషి చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి రామోజీరావు. ఆయన బతికినంత కాలం నీతి, నిజాయితీ అనే విలువలకు కట్టుబడి బతికారు అని గుర్తుచేశారు.

రామోజీరావు చాలా అవార్డులు దక్కించుకున్నారు. చాలా యూనివర్శిటీలు డాక్టరేట్లు ఇచ్చి ఆయనను సత్కరించాయి. భారత ప్రభుత్వం సైతం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఈక్రమంలో ఎప్పటినుంచో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని సీఎం తెలిపారు. రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేద్దాం. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తామని తెలిపారు. ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం..విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి ఎన్టీఆర్ ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తాం అని సంస్మరణ సభలో ప్రకటించారు.

Next Story

Most Viewed