Rammohan Naidu: ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

by Shiva |
Rammohan Naidu: ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో పురోగతిని ప్రజలకు ఎల్లవేళలా తెలియజేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు అని అన్నారు. ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని తెలిపారు. మొత్తం చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 4 శాతం పురోగతి ఉందని అన్నారు. మొత్తం విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36 శాతం మాత్రమే పూర్తయ్యాయని వెల్లడించారు. ఏది ఏమైనా ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని గడువు కంటే వేగంగానే పూర్తి చేస్తామని అన్నారు. జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ సంస్థ సహకారంతో ముందుకెళ్తామని, శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌ వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story