AP Politics: ఆపదలో నేనున్నాను అంటూ కొణతాల రామకృష్ణ..

by Indraja |
AP Politics: ఆపదలో నేనున్నాను అంటూ కొణతాల రామకృష్ణ..
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: ఆపదలో వున్న వృద్ధురాలిని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి కాపాడారు‌. ఘటన విజయరామరాజుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం, తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గాంధీనగరంలో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కాగా ప్రచారం ముగిసిన తరువాత తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో విజయరామరాజుపేట జంక్షన్ వద్ద ఒక వృద్ధ మహిళ ప్రమాదానికి గురై ఉండడం గమనించారు.

ఈ నేపథ్యంలో ఆయన ఆ వృద్ధురాలికి తన సొంత వాహనంలో ఎక్కించుకుని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిన ఆయన ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed